స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను ఎంతో ఉపయోగం మార్కుల సాధనకు సులువైంది

పదో తరగతి పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్‌ యాజమాన్యం స్టడీ మెటీరియల్‌ ఇచ్చారు. గణితం, సైన్స్‌ మెటీరియల్‌ చాలా చక్కగా ఉపయోగపడింది. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో ఇచ్చిన సూచనలతో పాటు, స్టడీ మెటీరియల్‌ను చదడంతో సైన్స్‌ 100 మార్కులకుగాను 93, గణితంలో 99 మార్కులు వచ్చాయి. మొత్తంగా 561 మార్కులు సాధించి స్కూల్‌లో సెకెండ్‌ ప్లేస్‌లో నిలిచాను.

– ధరణి, మద్దికెర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

నేను హలహర్వి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాశాను. 600 మార్కులకుగాను 553 మార్కులు సాధించాను. సాక్షి మీడియా గ్రూప్‌ యాజమాన్యం ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగపడింది. నేను అత్యధిక మార్కులు సాధించాను. – ప్రవీణ్‌కుమార్‌,

మేదేహల్‌ గ్రామం, హాలహర్వి మండలం

పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయుల బోధన, సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. నాకు 550 మార్కులు వస్తాయనే అనుకోలేదు. ఆ మార్కుల సాధనకు సాక్షి స్టడీ మెటీరియల్‌ చాలా చక్కగా ఉపయోగపడింది. ఈ మెటీరియల్‌లో చాలా సులభమైన అంశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకునేందుకు అవకాశం కలిగింది. – గౌస్‌ బాషా,

ఆలూరు ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌

ఆ మెటీరియల్‌ చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు

సాక్షి మెటీరియల్‌

అందుకున్న విద్యార్థినులతో

ఉపాధ్యాయులు(ఫైల్‌)

కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఇవ్వడంతో దానిని చదివిన వారు ఉత్తమ ఫలితాలను సాధించారు. చాలా మందికి 500పైగా మార్కులు వచ్చాయి. ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తోనే ఇదంతా సాధ్యమైందని వారు తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వ సాధారణ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల భోధనలో అత్యంత అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నిపుణుల బృందం ఏర్పాటు చేసి స్టడీ మెటీరియల్‌ను తయారు చేసి విద్యార్థులకు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి స్టడీ మెటరియల్‌ ఇవ్వలేదు. కేవలం పీడీఎఫ్‌ రూపంలో ఉన్న మెటీరియల్‌ను టీచర్లకు ఇస్తున్నారు. విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల నిపుణులతో స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల బోధనతో పాటు స్టడీ మెటిరియల్‌ తోడు కావడంతో విద్యార్థులు గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఉత్తమ మార్కులు సాధించారు. కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా సర్కార్‌ బడుల్లోని విద్యార్థులకు మార్కులు వచ్చాయి. సాక్షి మీడియా గ్రూప్‌ ఇచ్చిన మెటీరియల్‌ అత్యుత్తమ మార్కుల సాధనకు ఉపయోపడినట్లు విద్యార్థులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement