రంగారెడ్డి చెరువు కింద ఎకరానికి రూ.30వేల చొప్పున మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. ఎకరానికి దాదాపు రూ.35వేల వరకు పెట్టుబడి పెట్టాను. చెరువు తూము నుంచి నీరు పారుతూ పైరును పూర్తిగా ముంచేసింది. కోతలు కోయించేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పొలాల్లో నీరు ఉండటంతో వరికోత యంత్రాలు ఎక్కువ ధర అడుగుతున్నారు. గాలి వానకు పైరు నేలవాలింది. పొలంలో నీళ్లు ఉండటంతో గింజలు మొలకెత్తుతున్నాయి. రైతులు నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. – చిట్టిబాబు, కౌలు రైతు
ఇరిగేషన్ అధికారి నిర్లక్ష్యం మా పాలిట శాపంగా మారింది. చెరువు తూముకు షెట్టర్ లేక నీరు పొలాలకు చేరి కోతలు కష్టంగా ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదు. నేను రెండెకరాల్లో వరి సాగు చేసి నష్టపోతున్నాను. కొందరు రైతులు వరి కోతలు కోయించలేక వదిలేసుకోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధర లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు. రైతులు నష్టపోతున్నా అడిగేవారు లేరు.
– మౌలాలి రైతు
రుద్రవరం: అధికారుల నిర్లక్ష్యం, కూటమి నేతల ధన దాహం వెరసి రైతుల కష్టాలపాలవుతున్నారు. ఆరుగాలం శ్రమించే రైతులకు అండగా నిలవాల్సిన వారే కనికరం లేకుండా నట్టేట ముంచేస్తున్నారు. చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా.. పనులు చెరువు గట్లకే తెలుసన్నట్లుగా మారాయి. రుద్రవరం నుంచి దొర్వి లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయం వైపు వెళ్లే దారిలో రంగారెడ్డి చెరువు మరమ్మతులకు రూ. 4 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఇంత వరకు పనులు చేపట్టక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెరువు కింద దాదాపు 250 ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట కాలం పూర్తయి కోతలు మొదలయ్యాయి. చెరువులోని తూము ద్వారా నిరంతరం పారుతూ ఉండటంతో వరి కోత యంత్రాలు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు అధిక మొత్తం చెల్లించి చైన్ మెషన్లతో కోతలు చేపట్టినా ధాన్యాన్ని ట్రాక్టర్లలో తరలించేందకు సాధ్యం కావడం లేదు. దీంతో చేసేదిలేక ఆ యంత్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కూలీల ద్వారా బయటకు మోయాల్సిన పరి స్థితి నెలకొంది. కొందరు రైతులు వరి కోతలు కోయించలేక అలాగే వదిలేస్తున్నారు. ఇదంతా చెరువు తూము లు సరిగా లేక పోవడంతోనే రైతులు మండి పడుతు న్నారు. ఈ పరిస్థితి మండలంలోని 16 చెరువుల పరిఽ దిలో సమస్యలు ఎన్నో ఉన్నా అధికారులు పట్టించుకో వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం
నిధులున్నా చెరువు తూము
మరమ్మతులు చేపట్టిన వైనం
నిరంతరం పారుతుండటంతో
ఆరని పొలాలు
రైతులకు భారమైన పంటకోతలు


