థ్యాంక్యూ సాక్షి | - | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ సాక్షి

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

థ్యాంక్యూ సాక్షి అత్యధిక మార్కులు వచ్చాయి స్కూల్‌ టాపర్‌గా నిలిచా

నాకు పదో తరగతిలో 590 మార్కులు రావడం ఆనందంగా ఉంది. మా నాన్న ఖాజామొహిద్దీన్‌ పాత టైర్ల షాపును నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మా అమ్మ గృహిణి. మాది నిరుపేద కుటుంబం. సాక్షి యాజమాన్యం మా పాఠశాలలో పదో తరగతి మెటీరియల్‌ను పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో పాటు సాక్షి మెటీరియల్‌తోనే 590 మార్కుల స్కోరింగ్‌ సాధ్యమైంది. డాక్టర్‌ కావడం నా కల.

– షేక్‌ అనీషాతబసుమ్‌, ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అయ్యే సమయంలో సాక్షి మీడియా ఉచితంగా ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ ఉపయోగపడింది. నేను 519 మార్కులు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ఈ మెటీరియల్‌లో ఉన్న అత్యధిక ప్రశ్నలు రావడంతోనే అధిక మార్కులు వచ్చాయి. ఇందుకు కారణమైన సాక్షికి ధన్యవాదాలు.

– మహేష్‌బాబు, ఆలూరు

టెన్త్‌ పరీక్షలకు ముందు సాక్షి మీడియా గ్రూప్‌ వారు ఉచితంగా అందించిన స్టడీ మెటీరియల్‌ నాకు ఎంతో ఉపయోగపడింది. ఉపాధ్యాయులు మంచి నోట్సు అందించారు. దీంతో పరీక్షల్లో 577 మార్కులు సాధించా. స్కూల్‌ టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది.

– కె.గౌతమి, ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌

Advertisement
 
Advertisement
Advertisement