నమో.. నారసింహా! | - | Sakshi
Sakshi News home page

నమో.. నారసింహా!

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

మంత్రాలయం: శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో షోడశబాహు నరసింహస్వామి వేడుకలు గురువారం నిర్వహించారు. స్వామి జయంతి సందర్భంగా ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన చేసి హారతి ఇచ్చారు. శ్రీరాఘవేంద్రస్వామి మూలబృందవనానికి విశేష పూజలు చేపట్టి మంగళహారతులు గావించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మట్లాడుతూ..షోడశబాహు శ్రీలక్ష్మీనరసింహస్వామికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే అభిషేకం చేస్తామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకుని మొక్కలు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement