డాక్టర్‌నవుతా.. | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌నవుతా..

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

పాణ్యం గురుకుల పాఠశాల

విద్యార్థిని టి.సాయిశ్రీకి

596 మార్కులు

ఎమ్మిగనూరు రూరల్‌: పాణ్యం గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదివిన ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన తనకంటి సాయిశ్రీ 596 మార్కులు సాధించారు. పట్టణానికి చెందిన టి.చక్రపాణి, టి.పద్మావతిలకు టి.సాయిశ్రీ, టి.సాయిరాఘవేంద్ర సంతానం. చక్రపాణి ఓ ప్రైవేట్‌ కాలేజీలో చిరుద్యోగి. సాయిశ్రీ పాణ్యం గురుకుల పాఠశాలలో చదవగా, కుమారుడు సాయి రాఘవేంద్ర ఓ ప్రైవేట్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమార్తెకు 596 మార్కులు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఎంత కష్టమైనా ఇక మీదట కూడా ఉన్నత చదువులు చదివిస్తామని తల్లిదండ్రులు తెలిపా రు. విద్యార్థిని సాయిశ్రీ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇంటర్‌లో బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్‌ సీటు సాధిస్తానన్నారు. తన తండ్రి చిన్న ఉద్యోగం చేస్తూ తనతో పాటు తమ్ముడిని బాగా చదివిస్తున్నారన్నారు. డాక్టర్‌గా నన్ను నేను నిరూపించుకోవడంతో పాటు తల్లిదండ్రులకు అండగా నిలుస్తానన్నారు. తాను 596 మార్కులు సాధించటానికి పాఠశాల అధ్యాపకుల కృషి ఎంతో ఉందని, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement