వైఎస్సార్‌సీపీలో కార్యకర్తలకు సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో కార్యకర్తలకు సముచిత స్థానం

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

బేతంచెర్ల: గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం కల్పిస్తామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అండగా ఉంటామని నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ చలం రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, మురళీ, రామచంద్రుడు, కోడె వెంకటేశ్వర్లు, పిట్టల జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement