● మండుటెండల్లో
24.8 మిల్లీమీటర్ల వర్షం
జూపాడుబంగ్లా: భానుడి ఉగ్రరూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో జూపాడుబంగ్లా మండలంలో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం ధాటికి మండలంలోని భాస్కరాపురం గ్రామంలో మిద్దె వెంకటేశ్వర్లు ఇంటిముందున్న టెంకాయచెట్టుపై పిడుగుపడింది. ఒక్కసారిగా చెట్లంతా మంటలు వ్యాపించి కాలిపోవడం స్థానికులను కలవరానికి గురిచేసింది. ఆ సమయంలో వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు ఇంట్లో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.


