గుర్తు తెలియని వాహనం ఢీకొని..
పాణ్యం: మండల కేంద్రం పాణ్యంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే పోలీసు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి తిరుమల గిరి ఎదురుగా జాతీయ రహదారిపై అవుకు పట్టణానికి చెందిన ఎద్దుల రామకృష్ణ(50) బైక్‌పై నంద్యాల వైపు వెళ్తున్నాడు. ఎదురుగా కర్నూల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు, ట్రైనీ ఎస్‌ఐ ధనుజయ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతుడి వద్ద దొరికిన బుక్‌లో ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.


