భావితరాలకు మార్గదర్శకులు కావాలి
● హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడి్డ
ఎమ్మిగనూరుటౌన్: ‘‘ అందరూ ఆరు, ఏడు పదుల వయసు దాటిన వారే.. అందరికీ తెలియనిదంటూ ఏమీ లేదు.. భావితరాలకు మార్గదర్శకులు కావాలి’ అని తన తోటి మిత్రులు, సీనియర్లు అయిన పూర్వ విద్యార్థులకు హైకోర్ట్ జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1971–1974, 1972–1975 విద్యాసంవత్సరాలతో పాటు తరువాత చదివిన పూర్వ విద్యార్థుల అ‘పూర్వ’ మహా సమ్మేళనం ఎమ్మిగనూరు విశాల గార్డెన్‌లో శనివారం నిర్వహించారు. సుప్రీం కోర్ట్ న్యాయవాది బి.పురుషోతం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాడు చదువులు చెప్పిన కళాశాల అధ్యాపకులైన బి.కేశవరెడ్డి, టీజీ.దత్త, పివి.రాజు, పి.నాగిరెడ్డిలను హైకోర్టు జడ్జితో పాటు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఆనాటి హృదయాల ఆనందగీతం
అ‘పూర్వ’ మహా సమ్మేళనంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన వారందరూ కలిసి భోజనాలు చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి స్మృతులను ఒరరికొకరు చెప్పుకొంటూ సాయంకాలం వరకు సరదాగా గడిపారు. బాల్య మిత్రులను పేరుపెట్టి పలక రించారు. యాభై ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సి పాల్ దైవాదీనంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


