పంట నష్టం జాబితా ఆర్‌ఎస్‌కేల్లో ప్రదర్శించండి
బండి ఆత్మకూరు: రెండు రోజుల్లో పంట నష్టం అంచనా పూర్తి చేసి, తుది జాబితాను సామాజిక తనిఖీ నిమిత్తం ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రదర్శించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. తుపాన్ ధాటికి సంతజూటూరు, ఏ.కోడూరు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రైతు తన పంట నష్టం వివరాలను గ్రామ వ్యవసాయ అధికారుల ద్వారా ‘ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఏపీఏఐఎంఎస్)’ యాప్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట నష్టం అంచనాలు వంద శాతం ఖచ్చితంగా ఉండేలా అధికారులు పని చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఏఓ ప్రసాదరావు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు.


