
రేపు జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
ఓర్వకల్లు: మండలంలోని లొద్దిపల్లె గ్రామంలో ఈనెల 23న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే పోటీలలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఎడ్ల యజమానులు అదే రోజు ఉదయం 7 గంటల్లోగా రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9502653201, 9949865259, 9398283631 నంబర్లను సంప్రదించాలన్నారు.
అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్
మద్దికెర: మండలంలోని బురుజుల వద్ద హంద్రీనీ వా కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. బుధవారం కాలువ వెంబడి మట్టిని తరలిస్తుండగా అదుపుతప్పి టిప్పర్ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు స్పందించి వెంటనే డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించారు.