ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు | - | Sakshi
Sakshi News home page

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు

May 10 2025 8:20 AM | Updated on May 10 2025 8:20 AM

ఒక్క

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు

జూపాడుబంగ్లా: అంతన్నారు.. ఇంతన్నారు.. పదేళ్లు గడుస్తున్నాయి. అయినా ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం దక్కలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు అనేందుకు నిదర్శనం తంగడంచ భూములు. ఎంతో సారవంతమైన భూములు నిరుపయోగంగా మారాయి. నాణ్యమైన విత్తనాలు ఉత్పిత్తి చేయాల్సిన భూములు ముళ్లకంపలతో దర్శనమిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వందలాది ఎకరాలు కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేశారే కానీ.. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని తంగడంచ ఫారం భూముల్లో జిల్లాలో అల్ట్రామెగా ఫుడ్‌పార్కింగ్‌ చేసి జిల్లాలో 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు గుజరాత్‌ అంబుజా పరిశ్రమకు 211.10 ఎకరాలను ఎకరా రూ.4.50 లక్షల చొప్పున విక్రయించేందుకు ఏపీఐఐసీ ఒప్పందం కుదుర్చుకున్నారు. 2015 ఏప్రిల్‌ 30న టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్‌ 152ను విడుదల చేసింది. పరిశ్రమల నిబంధనల ప్రకారం పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ఆరు మాసాల్లోగా కంపెనీ స్థాపన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే భూములను కేటాయించి మూడేళ్లు గడిచినా గుజరాత్‌ అంబుజా పరిశ్రమ స్థాపించకపోవటంతో ఒప్పందాన్ని రద్దు చేసి వారికి కేటాయించిన భూములను రద్దు చేసి ఏపీఐఐసీకి అప్పగించారు. వారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించేందుకుగాను రూ.7.5కోట్లు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాకపోవటంతో ప్రస్తుతం ఏపీఐఐసీ అధ్వర్యంలోని 211 ఎకరాలు ముళ్లపొదలతో నిండి అడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా మారగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఇప్పటికై నా సీఎం చంద్రబాబునాయుడు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులైన యువతీ, యువకులను, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

జైన్‌ ఇరిగేషన్‌ అంతే..

తంగడంచ విత్తనోత్పత్తిక్షేత్రంలోని బంగారు పంటలు పండే నల్లరేగడి భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం జైన్‌ఇరిగేషన్‌ కంపెనీకి 624.54 ఎకరాలు కేటాయించింది. 2017లో జైన్‌ కంపెనీని స్థాపించినా ఇప్పటి దాకా 50 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాల్లేవు. కేవలం ఎక్కడో పెంచిన మొక్కలు ఇక్కడికి తెచ్చి విక్రయిస్తోంది. కేవలం స్టాక్‌ పాయింట్‌గా భూములను వినియోగించుకుంటోంది. తంగడంచ విత్తనోత్పత్తిక్షేత్రంలో అల్ట్రామెగా ఫుడ్‌పార్కింగ్‌ ఏర్పా టు కోసం పైలాన్‌ ప్రారంభించే సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆరు మాసాల్లోగా గుజరాత్‌ అంబుజా పరిశ్రమతో పాటు జైన్‌ పరిశ్రమలను స్థాపించి ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పదేళ్లు గడిచినా స్థానికులకు ఒక్క ఉద్యోగం రాలేదు. సీడ్‌ హబ్‌ పేరుతో మరో 600 ఎకరాలు కేటాయించినా ఇప్పటి వరకు ఒక విత్తనం నాటలేదు. ఒక మొక్క పెంచలేదు.

నిరుపయోగంగా

తంగడంచ ఫారం భూములు

పదేళ్ల క్రితం అల్ట్రామెగా ఫుడ్‌పార్క్‌కు

చంద్రబాబు శంకుస్థాపన

అంబుజా భూములు ఏపీఐఐసీకి

అప్పగింత

స్థానికులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని

జైన్‌ ఇరిగేషన్‌ కంపెనీ

సీడ్‌ హబ్‌ పేరుకే పరిమితం

రూ.7కోట్ల నిధులు వృథా..

గుజరాత్‌ అంబుజా పరిశ్రమ స్థాపిస్తారని హడావుడిగా ఏపీఐఐసీ రూ.7.09 కోట్ల నిధులను వెచ్చించి కేజీ రోడ్డు నుంచి అంబుజా పరిశ్రమ స్థాపన భూముల వరకు 1.304 కిలోమీటర్ల మేర రెండులైన్లతో కూడిన బీటీరోడ్డును నిర్మించింది. అలాగే సుద్దవాగుపై వంతెనను ఏర్పాటు చేసింది. కేటాయించిన భూములను సర్వేచేయించి సరిహద్దులు ఏర్పాటు చేయటంతోపాటు కంపచెట్లను తొలగించేందుకు మరో రూ.కోటి నిధులను వెచ్చించారు. ఇప్పటిదాకా ఆభూముల్లో ఒక్క పరిశ్రమలను స్థాపించ లేదు. దీంతో రూ.7 కోట్ల ప్రజాధనం వృథా అయింది. ఇప్పటికై నా నిరుపయోగంగా ఉన్న భూముల్లో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు1
1/3

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు2
2/3

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు3
3/3

ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement