
గ్రావెల్ చోరులు.. ఎస్సార్బీసీకి తూట్లు!
పాణ్యం: ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రధాన కాల్వ బండ్‌ను రాత్రికి రాత్రి తవ్వి ఎర్రటి గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. బనకచర్ల రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు ప్రధాన కాల్వ 126 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. గ్రావెల్ కోసం భారీ యంత్రాలతో ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ బండ్‌కు లోతైన గుంతలు పెడుతున్నారు. అంతకు ముందు గోరుకల్లు రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రావెల్ కోసం కొండను సైతం తరలించారు. ప్రస్తుతం ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు ఉన్న గ్రావెల్‌ను తరలిస్తున్నారు. రాత్రి సమయంలో ఒక కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా గ్రావెల్‌ను తవ్వుతున్నట్లు తెలుస్తోంది. భారీ లోతైన గుంతలను తవ్వి ఎవ్వరికీ అనుమానం రాకుండా భారీ బండరాళ్లను, చుట్టు పక్కల ఉన్న చెట్లను తీసి గుంతల్లో వేస్తున్నారు. అయితే ఉదయానికే ఆ గుంతలో నీటి ఊటలు భారీగా వస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోరుకల్లు వాసులు ఆరోపిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ వద్ద గ్రావెల్ తీసుకోవడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. గుంతుల తవ్వడంపై కింది స్థాయి అధికారులకు పరిశీలించామని చెప్పాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– కిష్ణన్న, ఎస్సార్బీసీ ఈఈ
చోద్యం చూస్తున్న అధికారులు

గ్రావెల్ చోరులు.. ఎస్సార్బీసీకి తూట్లు!