ఇళ్లు నిర్మించుకుంటున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఎస్సీ లబ్ధిదారులకు రూ. 50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేల చొప్పున అందాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అదనపు మొత్తం ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి.
– శ్రీనివాసనాయక్, ఎస్టీ సంఘ
రాష్ట్ర నాయకుడు, కోవెలకుంట్ల
ఇసుక, సిమెంట్ సరఫరా చేయాలి
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గతంలో ఉచితంగా 20 టన్నుల ఇసుక, రాయితీపై కడ్డీలు, సిమెంట్, ఇతర సామగ్రి సరఫరా అయ్యేవి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయితీపై కేవలం కడ్డీలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన సామాగ్రి అందకపోడంతో బయట కొనుగొలు చేయాల్సి వస్తోంది. మార్కెట్‌లో వీటి ధర అధికంగా ఉండటంతో ప్రజలకు భారం పడుతోంది.
– సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, కోవెలకుంట్ల
అదనపు మొత్తాన్ని అందజేయాలి