జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు

Mar 4 2025 12:55 AM | Updated on Mar 4 2025 12:54 AM

కొత్తపల్లి: ప్రాచీన సంగమేశ్వర ఆలయం జలాధివాసం వీడుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885 అడుగుల నుంచి 847 అడుగులకు చేరుకోవడంతో సప్తనది సంగమ ప్రాంతంలో కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సోమవారం సంగమేశ్వరాలయంలోని గోపురాలు పూర్తిగా బయటపడ్డాయి. మరి కొద్ది రోజుల్లో సంగమేశ్వరుడు కృష్ణమ్మను వీడి భక్తుల చేత పూజలందుకోనున్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో ఇంటర్‌ మీడియె ట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు డీఐఈఓ సునీత తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్‌–2 పరీక్షలకు 12,182 మందికి గాను 11,875 మంది హాజరు కాగా 307 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీ చేసినట్లు తెలిపారు.

‘పది’ విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అన్ని గుర్తింపు పొందిన పాఠశాలల లాగిన్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవా రం తెలిపారు. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు వాట్సాప్‌ 9552300009 నెంబరులో విద్యాసేవలు ఎంపిక చేసుకుని ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు.

వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలు

కర్నూలు(హాస్పిటల్‌): అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలను కర్నూలు, నంద్యాల జిల్లా ల వెబ్‌సైట్లు https://kurnool.ap.gov.in, https: //nandyal.ap.gov.in, కర్నూలు మెడికల్‌ కాలేజి వెబ్‌సైట్‌ https:// kurnoolmedicalcollege. ac.inలలో అప్‌లోడ్‌ చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూ లు జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ హాస్పిటల్‌, గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు 2023 నవంబర్‌ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి 11 కేటగిరిల అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.

కేసీకి నీటి విడుదల బంద్‌

కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి కర్నూలు–కడప కెనాల్‌కు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అలాగే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదల నిలిపివేశారు. మల్యాల నుంచి 675 క్యుసెక్కుల నీరు మాత్రమే కేసీకి పంపింగ్‌ చేస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ సబ్‌ డివిజన్‌ ప్రాంతంలోని సాగులో ఉన్న ఆయకట్టుకు వచ్చే నెల వరకు నీరిస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్‌ జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఉపాధ్యాయుల సీనియారిటీపై అభ్యంతరాల స్వీకరణ

కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాలు డీఈఓ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో తెలపాలని డీఈఓ ఎస్‌.శ్యామూల్‌ పాల్‌ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆధారంగా తయారు చేసిన జాబితాను వైబ్‌సైట్‌తో పాటు నోటీసు బోర్డులో కూడా అందుబాటులో ఉంచామన్నారు. జెడ్పీ, మండల, మునిసిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఈనెల 10వ తేదీలోపు డీఈఓ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల లో అందజేయాలని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆర్జేడీ కడప కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement