నల్లగొండ : న్యాయవ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై నిర్వహించిన శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి సమాజంలో కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కేసులు, చిన్నచిన్న వ్యక్తిగత సమస్యల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించ గలిగే అవకాశం ఉందన్నారు. కోర్టుల్లో పెరిగిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందన్నారు. మధ్యవర్తితం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. న్యాయవాదులు ఐదు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్‌కు ఎంజీ యూనివర్సిటీలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి బోకేలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్టర్ సీహెచ్.పంచాక్షరి, జిల్లా జడ్జి కవిత, యాదాద్రి జిల్లా జడ్జి జయరాజు, పురుషోత్తం, అనంతరెడ్డి, నాంపల్లి నరసింహ, న్యాయవాదులు పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వం.. కేసుల భారం తగ్గిస్తుంది
ఇసుక మరింత ప్రియం
ప్రభుత్వం నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. కానీ, ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఇసుక దొరకక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో రూ.3 వేలకు దొరకే ఇసుక ఇప్పుడు రూ.7వేలకు పైగా చేరింది. అది కూడా చాలా ఇబ్బందులు పడి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇసుక ధర పెరగడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందించాలి.
– సయ్యద్ గౌస్, శెట్టిపాలెం, వేములపల్లి మండలం
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి ఇసుక రాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తుంది. ఇసుక ధర రెట్టింపు కావడం, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సా యంలో పెద్ద మొత్తం ఇసుక కోసం ఖర్చు చే యాల్సి వస్తోంది. సాండ్ బజార్‌లో ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే నాలుగు టన్నులకు రూ.4వేలు, ఆ ట్రాక్టర్ రవాణా ఖర్చు దూ రాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతోపాటు వారు చెప్పినంత ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్ ఇసుకకు సుమారు రూ.7వేలకు పైగా అవుతోంది.
మిర్యాలగూడ : ఇసుక సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. గతంలో తక్కువ ధరకు దొరికిన ఇసుక.. ఇప్పుడు రెట్టింపు అయ్యింది. గతంలో రీచ్‌ల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక సరఫరా చేసేవారు. దానికి తోడు మిర్యాలగూడలో సాండ్ బజార్ కూడా అందుబాటులో ఉండడంతో ఇసుక కొరత తీరుతుందని ప్రజలు భావించారు. కానీ, ఇసుక దందా చేసే వారు దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా రవాణా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలలోపు ఉండగా.. ఇప్పుడు రూ.5 వేలకు పైగా దాటింది. పైగా రవాణా ఖర్చులను కూడా వినియోగదారులు భరించాల్సి ఉండడంతో అదనంగా మరో రూ.2వేల మేర ఖర్చవుతుండడంతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.7వేలకు చేరింది. ఇసుక ధర పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
సాండ్ బజార్‌కు చేరకుండా పక్కదారి
అక్రమ రవాణాను అరికట్టి ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలని భావించి మిర్యాగూడలో సాండ్ బజార్ ఏర్పాటు చేశారు. వినియోగదారులు.. వారికి అవసరమైన ఇసుక ఇక్కడి నుంచి కొనుగోలు చేయాలని అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వంగమర్తి నుంచి ఇసుకను టిప్పర్ల ద్వారా మిర్యాలగూడకు తరలించి సాండ్ బజార్‌లో డంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుగోలు చేసి.. సొంత రవాణా ఖర్చులతో ఇసుకను తీసుకెళ్లాలి. కానీ వంగమర్తి నుంచి వచ్చే ఇసుక టిప్పర్లు రాత్రికి రాత్రే ప్రైవేట్ స్థలాలకు తరలించి అక్కడ డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా దళారులు అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. తాజాగా గురువారం రాత్రి మూడు టిప్పర్లు సుమారు 180 టన్నుల ఇసుకను పట్టణ శివారులోని రవీంద్రనగర్ కాలనీ వద్ద డంపింగ్ చేసినట్లు సమాచారం. శుక్రవారం కూడా మరో మూడు టిప్పర్లు ద్వారా ఇసుకను ప్రైవేట్ స్థలంలో డంపింగ్ చేసినట్లు తెలిసింది. వారం రోజులుగా ఇసుక పక్కదారి పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక, ఆంధ్రా నుంచి కూడా మిర్యాలగూడకు ఇసుకను తరలిస్తున్నారు. ఈనెల 13 నుంచి 19వ తేదీలోపు ఏడు లారీలను వాడపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. మఠంపల్లి ప్రాంతంలో నుంచి కూడా అక్రమంగా ఇసుకను జిల్లాలో డంపింగ్ చేస్తున్నారు.
అధిక రేటుకు విక్రయం
ఇసుక రీచ్‌ల ద్వారా బుకింగ్ చేసుకుంటే మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడు, వేములపల్లి మండలంలోని రావులపెంట, కామేపల్లి రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అయ్యేది. ఈ ప్రాంతాల నుంచి ఇసుకను కొనుగోలు చేస్తే ట్రాక్టర్ ఇసుక రూ.3వేల లోపు మూడున్నర టన్నుల ఇసుక అందేది. కానీ సాండ్ బజార్‌లో సాధారణంగా అయితే టన్ను రూ.1300 నాలుగు టన్నులకు రూ.5200, ఇందిరమ్మ ఇళ్లకు రూ.1000 చొప్పున రూ.4వేలు ధర పడుతుంది. రవాణా చార్జీలు అదనం. దూరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. కొందరు దళారులు ఇందిరమ్మ ఇళ్ల పేరిట అధికారుల చేతులు తడిపి అనుమతులు తెచ్చుకుని అధిక ధరలకు అక్రమంగా అమ్ముతున్నారు. వంగమర్తి నుంచి వచ్చే ఇసుక ఒక టిప్పర్ సుమారు 50టన్నుల నుంచి 60టన్నులు వస్తుంది. ఆ ఇసుకను సాండ్ బజార్‌లో డంపింగ్ చేయాలి. కానీ వారం రోజులుగా ప్రైవేట్ స్థలాల్లో డంపింగ్ చేస్తున్నారు. అక్కడ దళారులు టన్ను రూ.1900 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 4టన్నులు అయితే రూ.7600కు అమ్ముతున్నారు. పైగా రవాణా చార్జీల వేరుగా వసూలు చేస్తున్నారు.
వాడపల్లి వద్ద పట్టుబడిన ఇసుక లారీలు, రవీంద్రనగర్ శివారులో అక్రమంగా డంప్ చేసిన ఇసుక
ఫ మిర్యాలగూడలో 4 టన్నులకు రూ.7 వేల పైనే..
ఫ సాండ్ బజార్ పేరుతో ప్రైవేట్ స్థలాల్లో డంపింగ్
ఫ ఆంధ్రా నుంచి కూడా అక్రమంగా రవాణా
ఫ అధిక రేట్లకు విక్రయించి సొమ్ము
చేసుకుంటున్న దళారులు
ఫ ఆందోళనలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు
ఫ హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్
ఫ పీవీ విగ్రహావిష్కరణ
ఫ పీవీ విగ్రహావిష్కరణ
ఫ పీవీ విగ్రహావిష్కరణ
ఫ పీవీ విగ్రహావిష్కరణ
ఫ పీవీ విగ్రహావిష్కరణ


