బీసీలకు భారీగా కోత | - | Sakshi
Sakshi News home page

బీసీలకు భారీగా కోత

Nov 24 2025 7:50 AM | Updated on Nov 24 2025 7:50 AM

బీసీలకు భారీగా కోత

బీసీలకు భారీగా కోత

రొటేషన్‌ పద్ధతి అమలు..

2011 జనాభా లెక్కల ప్రకారం

జిల్లాలో 869 పంచాయతీలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్‌ విధానం బీసీలను భారీగా దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోయాయి. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్‌ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలంతా ఆయా వివరాలను ఆర్డీఓలకు అందించగా, ఆర్డీఓలు వాటిని ఫైనల్‌ చేసి కలెక్టర్‌కు పంపారు.

బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారు. అయితే రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో బీసీ రిజర్వేషన్లలో భారీగా కోత పడింది. 2019 సంవత్సరంలో బీసీలకు 164 సర్పంచ్‌ స్థానాలు రిజర్వు కాగా.. ఆదివారం చేసిన రిజర్వేషన్‌లో కేవలం 140 స్థానాలే దక్కాయి. 2019తో పోల్చుకుంటే 24 స్థానాలు తగ్గిపోయాయి. ఇక ఎస్సీలకు 153 స్థానాలు రిజర్వు కాగా, ఎస్టీలకు 192 స్థానాలు, అన్‌రిజర్వుడులో 384 స్థానాలు ఉన్నాయి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ సంగతి దేవుడెరుగు.. పాత రిజర్వేషన్‌ పద్ధతిలో అమలు చేయడం, రొటేషన్‌లో రిజర్వేషన్‌ కల్పించడంతో బీసీ సీట్లకు భారీగా కోత పడింది.

అన్నీ సిద్ధం చేసిన అధికారులు

గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినందున ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిపికేషన్‌ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితాతో పాటు బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెటు బాక్సులు తెప్పించి సిద్ధంగా ఉంచుకున్నారు.

పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

ఫ రొటేషన్‌ పద్ధతి అమలుతో బీసీలకు తగ్గిన స్థానాలు

ఫ బీసీలకు 2019 ఎన్నికల్లో 164.. ఇప్పుడు 140 స్థానాలే..

ఫ ఎస్సీలకు 153, ఎస్టీలకు 192 స్థానాలు రిజర్వ్‌

ఫ అన్‌ రిజర్వుడ్‌లో 384 పంచాయతీలు

ఫ ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల సర్పంచ్‌ రిజర్వేషన్లను గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. పాత రిజర్వేషన్లనే యథావిధిగా అమలు చేశారు. బీసీ రిజర్వేషన్లను డెడ్‌కేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. సెప్టెంబరు నెలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో 310 స్థానాలను కేటాయించారు. ఇప్పుడు కేవలం 140 స్థానాలే బీసీలకు దక్కాయి. రొటేషన్‌ పద్ధతి వల్లే బీసీలకు సర్పంచ్‌ స్థానాల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరిగింది.

మండలాల వారీగా సర్పంచ్‌ రిజర్వేషన్లు ఇలా..

మండలం ఎస్సీ ఎస్టీ బీసీ అన్‌రిజర్వుడ్‌ మొత్తం

మహిళ జనరల్‌ మహిళ జనరల్‌ మహిళ జనరల్‌ మహిళ జనరల్‌

నల్లగొండ 4 4 0 0 3 4 8 8 31

కనగల్‌ 3 3 0 1 4 4 8 8 31

తిప్పర్తి 3 3 0 0 4 4 6 6 26

నకిరేకల్‌ 2 2 0 0 1 2 5 5 17

కట్టంగూర్‌ 2 3 0 0 3 3 5 6 22

శాలిగౌరారం 3 3 0 0 3 3 6 6 24

కేతేపల్లి 2 2 0 0 2 2 4 4 16

నార్కట్‌పల్లి 3 4 0 0 3 4 7 8 29

చిట్యాల 1 2 0 0 3 3 4 5 18

అనుముల 2 3 1 1 2 3 6 6 24

పెద్దవూర 2 2 4 5 1 2 6 6 28

తిరుమలగిరిసాగర్‌ 1 2 10 10 0 1 5 6 35

త్రిపురారం 2 3 4 5 1 2 7 8 32

గుర్రంపోడు 4 4 1 1 5 5 9 9 38

నిడమనూరు 3 3 0 1 3 4 7 8 29

మిర్యాలగూడ 4 4 7 8 1 2 10 10 46

వేములపల్లి 1 2 0 0 1 2 3 3 12

మాడుగులపల్లి 2 2 1 2 3 4 7 7 28

అడవిదేవులపల్లి 0 0 3 3 0 0 3 4 13

దామరచర్ల 2 2 7 8 0 0 8 8 35

చండూరు 2 2 0 0 2 3 5 5 19

మునుగోడు 3 3 0 0 4 4 7 7 28

గట్టుప్పల్‌ 0 1 0 0 1 1 2 2 7

నాంపల్లి 3 4 2 3 3 3 7 7 32

మర్రిగూడ 1 2 1 1 2 2 4 5 18

దేవరకొండ 2 3 10 11 1 1 6 7 41

డిండి 3 4 8 8 1 1 7 7 39

పీఏపల్లి 1 2 4 6 1 2 4 5 25

గుడిపల్లి 1 2 1 1 0 1 3 3 12

కొండమల్లేపల్లి 1 2 7 8 1 1 3 4 27

చింతపల్లి 3 3 4 5 3 4 7 7 36

చందంపేట 2 2 7 8 0 1 5 5 30

నేరెడుగొమ్ము 1 1 6 8 0 0 2 3 21

మొత్తం 69 84 88 104 62 78 186 198 869

జిల్లాలో 869 గ్రామ పంచాయతీలుండగా, వాటిల్లో 384 పంచాయతీలను అన్‌రిజర్వుడ్‌గా ఉంచగా.. మహిళకు 186, జనరల్‌కు 198 స్థానాలు కేటాయించారు. బీసీలకు 140 స్థానాలు రిజర్వు కాగా, అందులో మహిళలకు 62, జనరల్‌కు 78 స్థానాలను కేటాయించారు. ఎస్సీ కేటగిరికి 153 స్థానాలను రిజర్వు చేయగా, అందులో మహిళలకు 69, జనరల్‌కు 84 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరిలో 192 స్థానాలు రిజర్వు కాగా, అందులో మహిళలకు 88 జనరల్‌కు 104 స్థానాలను రిజర్వు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement