ప్రజా ఉద్యమాలు నడిపింది సీపీఐనే
మిర్యాలగూడ అర్బన్ : బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు, భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజాఉద్యమాలు నడిపింది సీపీఐ పార్టీనే అని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల ముగింపు సభ విజయవంతం చేయడానికి చేపట్టిన బస్సు జాతా గురువారం మిర్యాలగూడ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మొట్టమొదటగా పోరాటం చేసింది సీపీఐ అని.. బీజేపీ ఏరోజు దేశం కోసం పోరాడలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజల మధ్య మత విద్వేషాలు, భావోద్వేగాలను రెచ్చగొడుతోందన్నారు. బీజేపీ బూటకపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను చంపుకుంటూపోతోందని విమర్శించారు. మావోయిస్టులు తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి చట్టబద్ధంగా విచారణ జరిపించాలే కానీ బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం విచారకరమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బాలనరసింహ మాట్లాడుతూ డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించే సభకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముందుగా సీపీఐ జెండాను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్దె శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, పబ్బు వీరస్వామి, కెఎన్.రెడ్డి, నాయకులు జగన్, గణేశ్‌నాయక్, జిల్లా యాదయ్య, గజాల లక్ష్మీనరసింహారెడ్డి, ఎండీ.సయీద్, బిల్లా కనకయ్య, ధీరావత్ లింగానాయక్, అంజనపల్లి రామలింగం, ధనావత్ శాంత, వల్లంపట్ల వెంకన్న, ఎర్రబోతు పద్మ, దాసర్ల దుర్గమ్మ, షమీమ్, ఉదయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


