● కూత.. మోత
చందంపేట : మండలంలోని గన్నెర్లపల్లి గ్రామ పరిధిలోని చెంచుకాలనీలో 65 కుటుంబాలు.. 200 జనాభా ఉంది. ఈ కాలనీకి రెండు నెలలుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీలో ఉన్న రెండు బోర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో గుక్కెడు నీటి కోసం ఈ కాలనీ ముందు నుంచి పారుతున్న డిండి ప్రాజెక్టు నీటిని పట్టుకొని దప్పిక తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా ఈ వాగులో నీరుంది. లేకుంటే బిందెలు తీసుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిందే. నీటి సమస్య తీర్చాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఖాళీ బిందెలతో బుధవారం కాలనీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని దేవరకొండ – శ్రీశైలం వెళ్లే రోడ్డు వద్దకు నడిచి వచ్చి రాస్తారోకో చేపట్టారు. ఎస్‌ఐ లోకేష్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామని చెప్పడంతో వెనుదిరిగారు.
గుక్కెడు నీటికి గిరిజనుల గోస
● కూత.. మోత
● కూత.. మోత


