‘బ్రాండ్’కు మిర్యాలగూడ ఆస్పత్రి
మెరుగైన వైద్యం అందుతుంది
● ఆస్పత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు
● అబ్డమిన్ స్కానింగ్ మిషన్ అందుబాటులోకి తేవడం
● రోగి అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో అందించే ట్రామాకేర్ సిస్టమ్ ఏర్పాటు
● ఆస్పత్రిలో, ఆస్పత్రి బయట విద్యుదీకరణ
● ఆస్పత్రి సుందరీకరణ పనులు
● ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా రిసెప్షనిస్టులను ఏర్పాటు చేసి.. వారిద్వారా రోగులకు వైద్యులచే వైద్య సేవలు అందించడం
● రోగులు, వారి సహాయకుల కోసం అధునాతన క్యాంటిన్ ఏర్పాటు చేయడం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రాండ్’ పథకానికి ఎంపికై ంది. ఈ పథకంలో భాగంగా ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. సుమారు రూ.10 కోట్ల నిధులతో ఆధునిక యంత్రాలతో పాటు ఆస్పత్రిలోని మౌలిక వసతులు కల్పించనున్నారు. బ్రాండ్ పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.
రెండు వందల పడకల ఆస్పత్రిగా మార్పు
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ కావడంతో జిల్లా ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నిరకాల వైద్య సేవలను అందుబాటులోకి తెవడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం నియమించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రూ.16 కోట్లలో చేపట్టిన నూతన భవన నిర్మాణం పూర్తి కావచ్చింది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో నూతన వంద పడకల భవనాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఏరియా ఆస్పత్రిలో పీజీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బ్రాండ్ పథకంలో కూడా ఏరియా ఆస్పత్రికి చోటు దక్కడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల బృందం తనిఖీలు..
ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బ్రాండ్ పథకంలో భాగంగా ఇప్పటికే వైద్య, ఇంజనీర్ల బృందం ఏరియా ఆస్పత్రిని సందర్శించినట్లు తెలిసింది. ఆస్పత్రిలోని వార్డులు కాన్పులు జరిగే తీరు, ఆపరేషన్ థియేటర్, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న పనులపై ఆంచనా రూపొందిచుకుని వెళ్లినట్లు సమాచారం.
బ్రాండ్ పథకానికి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ఎంపిక కావడం శుభ పరిణామం. ఈ పథకం ద్వారా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలతో పా టు అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే జిల్లా అస్పత్రిగా అప్‌గ్రేడ్ కావడం, పీజీ కళాశాల అనుమతి రావడంతో బ్రాండ్ పథకం ద్వారా కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. ఇంజనీర్ల బృందం ఆస్పత్రిని పరిశీలించింది. త్వరలోనే ఆ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
– డాక్టర్ మాతృనాయక్,
జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి
ఫ ఇప్పటికే జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్..
ఫ పూర్తికావచ్చిన నూతన భవన నిర్మాణం
ఫ పీజీ కళాశాల సైతం
ఏర్పాటు చేసేందుకు ఆమోదం
ఫ బ్రాండ్ పథకంతో కార్పొరేట్ స్థాయిలో సమకూరనున్న వసతులు
‘బ్రాండ్’కు మిర్యాలగూడ ఆస్పత్రి


