జూరాలకు 4,505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

జూరాలకు 4,505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Jun 7 2026 9:06 AM | Updated on Jun 7 2026 9:06 AM

ధరూరు/ అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 4,505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 40 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో దాదాపు 2.5 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిగువనున్న శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 818 అడుగుల వద్ద 39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement