కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జిల్లావాసులై, వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు మించరాదన్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అదే విధంగా హైదరాబాద్‌లోని బేగంపేట, రామంతాపూర్ పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 2019 జూన్ 1 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 98485 28161 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
● హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతి ప్రవేశానికి జిల్లాలోని గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు 2019 జూన్ 1నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోగా జిల్లా గిరిజనాభివృద్ధిశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 22న లాటరీ పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
దరఖాస్తు చేసుకోండి
మన్ననూర్: స్థానిక ఐటీఐ/ఏటీసీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం పలు కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 8వ తేదీలోగా http://iti.telanga na.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 85004 61013, 85004 61022 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ప్రశాంతంగా పాలిసెట్
కందనూలు: జిల్లాలో బుధవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 2,912 మంది విద్యార్థులకు గాను 2,727 మంది హాజరయ్యారు. మరో 185 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్మోహన్ తెలిపారు. 93.64 హాజరుశాతం నమోదైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు
కొల్లాపూర్: జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు మిషన్ భగీరథ సీఈ లలిత, ఎస్‌ఈ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు బుధవారం కొల్లాపూర్ పట్టణంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్ షేక్ రహీంపాషా సమీక్షించారు. అనంతరం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌ను పరిశీలించారు. నీటినిల్వ, పంపింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. వేసవి ముగిసే వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. వారి వెంట ఈఈ సుధాకర్‌సింగ్ తదితరులు ఉన్నారు.
నిలకడగా ఉల్లి ధరలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్‌లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు.


