
1975లోనే పాలకేంద్రం
గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు.
ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి.