నేటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్‌ అండర్‌–19 క్రికెట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్‌ అండర్‌–19 క్రికెట్‌

Jun 2 2025 12:41 AM | Updated on Jun 2 2025 12:41 AM

నేటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్‌ అండర్‌–19 క్రికెట్‌

నేటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్‌ అండర్‌–19 క్రికెట్‌

లీగ్‌ మ్యాచ్‌ల వివరాలు

ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో అండర్‌– 19 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి రౌండ్‌కు సంబంధించి సోమవారం మహబూబ్‌నగర్‌– వనపర్తి జట్లు (వేదిక– మహబూబ్‌నగర్‌), జడ్చర్ల– గద్వాల జట్లు (జడ్చర్ల), నారాయణపేట– నాగర్‌కర్నూల్‌ (నారాయణపేట) జరుగుతాయి.

● రెండో రౌండ్‌ మంగళవారం నాగర్‌కర్నూల్‌– మహబూబ్‌నగర్‌ జట్లు (మహబూబ్‌నగర్‌), గద్వాల– వనపర్తి (వనపర్తి), జడ్చర్ల– నారాయణపేట (జడ్చర్ల) మ్యాచ్‌లు ఉంటాయి.

● మూడో రౌండ్‌ బుధవారం మహబూబ్‌నగర్‌– గద్వాల (మహబూబ్‌నగర్‌), నాగర్‌కర్నూల్‌– జడ్చర్ల (జడ్చర్ల), వనపర్తి– నారాయణపేట (వనపర్తి) కొనసాగుతాయి.

● నాలుగో రౌండ్‌ గురువారం మహబూబ్‌నగర్‌– నారాయణపేట (మహబూబ్‌నగర్‌), జడ్చర్ల– వనపర్తి (జడ్చర్ల), గద్వాల– నాగర్‌కర్నూల్‌ (గద్వాల) ఉంటాయి.

● ఐదో రౌండ్‌ శుక్రవారం జడ్చర్ల– మహబూబ్‌నగర్‌ (మహబూబ్‌నగర్‌), నాగర్‌కర్నూల్‌– వనపర్తి (నాగర్‌కర్నూల్‌), గద్వాల– నారాయణపేట (గద్వాల)లో నిర్వహిస్తారు.

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో ఎండీసీఏ ఆధ్వర్యంలో మరోసారి ఇంట్రా డిస్ట్రిక్ర్ట్‌ టోర్నమెంట్‌ జరగనుంది. గత నెల 19 నుంచి 31 వరకు అండర్‌– 23 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ టూడే లీగ్‌ను నిర్వహించగా మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌షిప్‌గా నిలిచింది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇప్పుడు అండర్‌– 19 క్రికెట్‌ లీగ్‌ను నిర్వహించనున్నారు.

2 నుంచి 6 వరకు..

ఔత్సాహిక గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్‌ పురుషుల అండర్‌–19 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్‌లుగా విభజించారు. పూల్‌–ఏలో జడ్చర్ల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జట్లు, పూల్‌–బీలో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో 15 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్‌గా నిలుస్తుంది.

ఆరు జట్లు.. 15 లీగ్‌ మ్యాచ్‌లు

ఉమ్మడి జిల్లాలోని

ఆరు వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ

అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement