ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి

ములుగు: మొక్కజొన్న,ఽ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతీ ప్రైవేట్‌ గోదాంను అవసరమైతే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలను పెంచాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లను తాత్కాలిక షెడ్లుగా వినియోగించాలని ఆదేశించారు. అవసరమైన వాహనాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement