ఏటూరునాగారం: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అకాడమిక్ మానిట రింగ్ అధికారి శ్యామ్‌సుందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం చేపట్టిన రెమిడియల్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ మళ్లీ వారు ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో టెన్త్‌లో అత్యధిక ఉత్తీర్ణత శాతం వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని వివరించారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందకుండా ప్రణాళికతో చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించారు. అదే విధంగా జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి వద్ద పిల్లలు టీవీలు, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోవద్దని ప్రభుత్వం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేసిందన్నారు. సమ్మర్ క్యాంప్ ఉత్సాహభరితంగా ఉంటుందని, విద్యార్థులు ఈ క్యాంప్‌ను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


