విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1లో వాటర్‌ సమస్య, చిరుతపల్లి 2 పాఠశాలలో రూప్‌ లీకేజీ సమస్య ఉందని పీఓ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.

ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పొ

Advertisement
 
Advertisement
Advertisement