నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు తెలియకుండానే నా పెద్ద కోడలు తన పేరు మీదకు మార్చుకుంది. నా పెద్ద కుమారుడు మరణించిన తర్వాత నా కోడలు ఆస్తులను తన పేరు మీదకు మార్చుకుంది. నా బాగోగులు చూసుకునే వారు లేరు. అధికారులు స్పందించి నా పేరు మీదకు ఆస్తిని మార్చాలి.
– అట్టం సావిత్రమ్మ, ములుగు
మరమ్మతు పనులు చేయించాలి..
కంతనపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి. పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దానిని పట్టించుకోవడం లేదు. వెంటనే ఐటీడీఏ పీఓ స్పందించి పాఠశాలలో మరమ్మతు పనులు చేయించాలి.
– చింత చంద్రయ్య, కంతనపల్లి, కన్నాయిగూడెం మండలం


