ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎస్పీ సోమవారం టాస్ వేసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు. ములుగు మావోయిస్టు రహిత జిల్లాగా మారిందని వెల్లడించారు. జిల్లాలో మత్తు, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


