ములుగు: డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ నమోదు ప్రక్రియ నిర్వహించారు. సోమవారం నుంచి జనగణనలో భాగంగా హౌజింగ్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్‌ఎల్‌బీ) కార్యక్రమానికి ఎన్యుమరేటర్లు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 807 బ్లాక్‌లను గుర్తించారు. ప్రతి బ్లాక్‌లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేసేందుకు జిల్లాలో 545 మంది ఎన్యూమరేటర్లను, 97 మంది సూపర్ వైజర్లను నియమించారు. స్వీయ నమోదులో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినపుడు సరిచేసుకోవాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. మొదటి మూడు రోజులు మ్యాప్ తయారీ చేసి ఇళ్లకు నంబర్లను కేటాయించనున్నారు. అనంతరం 33 ఆంశాలతో కూడిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. వచ్చే 9వ తేదీలోగా హెచ్‌ఎల్‌బీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు ఆదనపు కలెక్టర్ మహేందర్‌జీ తెలిపారు.
జిల్లాలో 807 బ్లాకులు
545 ఎన్యుమరేటర్లతో ఇంటింటి సర్వే


