సరస్వతీఘాట్‌లో భారీ సెట్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సరస్వతీఘాట్‌లో భారీ సెట్టింగ్‌

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్‌ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే 40 టెండ్‌సిటీ టెండ్లు, మాడ్రన్‌ లుక్‌తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement