రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

ఏటూరునాగారం: 3వ తెలంగాణ అథ్లెటిక్స్‌ క్రీడా పోటీల్లో మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఏటూరునాగారం మండలానికి చెందిన సాయిరాం అండర్‌ 16 హై జంప్‌లో రజత పతకం సాధించగా, హరిప్రియ అండర్‌ 18లో జావెలిన్‌త్రోలో రజత పతకం సాధించినట్లు జిల్లా కోచ్‌ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ క్రీడాపోటీలు ఆదివారం హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహించినట్లు వెల్లడించారు.

డాక్టర్‌ శ్రీలతకు ఉత్తమ అవార్డు

కాళోజీ సెంటర్‌: తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీలత ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్‌ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ నుంచి అవార్డును స్వీకరించారు. శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా టీపీఏ సభ్యులు, ప్రముఖులు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement