ములుగు రూరల్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నేడు (ఆదివారం) నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్‌యాదవ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ప్రదాని మోదీ ఆధ్వ ర్యంలో దేశాభివృద్ధి సాధ్యమన్నారు. నాయకులు వాసుదేవరెడ్డి, రాకేశ్, ప్రమోద్‌రెడ్డి, రవీందర్, ప్రవీణ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.
13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష
ములుగు రూరల్: పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం శనివారం తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు, జాకారం బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో కలిపి రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులను కేటాయించినట్లు వివరించారు. 13వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పారు. విద్యార్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో రావాలని.. వారి వెంట హెచ్‌బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్‌నర్ తీసుకురావాలని తెలిపారు.
వాహనం ఢీకొని గేదెలు మృత్యువాత
వెంకటాపురం(కె): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలోని పాత్రాపురం గ్రామ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. గ్లోగూడెం గ్రామానికి చెందిన రాంబాబు తన గేదెలను శుక్రవారం ఉదయం పాలెం వాగు సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. కాగా, రాత్రి గేదెలు ఇంటికి రాలేదు. శనివారం ఉద యం వెతుకుతుండగా పాత్రాపురం పాలెం వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృత్యువాత పని కనిపించాయి. పాత్రాపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఉచిత బాల్ బాడ్మింటన్ శిక్షణ
చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలో ఉచిత (సమ్మర్ క్యాంప్) బాల్ బ్యాడ్మింటన్ శిక్షణను ఏర్పాటు చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఉడుత మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణలో రన్నింగ్, వ్యాయాయంతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.


