తాను ఎలా ఉన్నా.. పిల్లలను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. పస్తులుండైనా కన్నవారి కడుపు నింపాలనుకుంటుంది. కష్టాల కడలిని ఎదురీదైనా పిల్ల ల భవిష్యత్‌కు బాటలు వేయాలనుకుంటుంది. కుటుంబ పెద్ద మరణించినా అన్నీ తానై నడిపిస్తుంది. ఇలా ఉమ్మడి జిల్లాలో అనాథలకు ప్రేమను పంచుతున్న వారు ఒకరైతే.. భర్తలేకపోయినా పెంచి పెద్ద చేసిన వారు మరొకరు. ఆదర్శంగా నిలుస్తున్న వారెందరో.. అలాంటి దైవాల ప్రేమకు అక్షర రూపమిస్తూ.. నేడు(ఆదివారం) మాతృ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ పరి ధిలో తాగునీటి సమస్యపై నేడు (ఆదివారం) సాక్షి ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యల పరిష్కారంపై మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ ప్రజలకు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. తాగునీటి ఇబ్బందులను నేరుగా చైర్‌పర్సన్‌తో ప్రజలు మాట్లాడవచ్చు.
సమయం: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్లు
79957 34031, 90104 04994


