చెరువులో చేపల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

చెరువులో చేపల మృత్యువాత

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

చిట్యాల: చైన్‌పాక గ్రామ శివారులోని పెద్దమ్మకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో 1.50 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. ముదిరాజ్‌ సొసైటీ అధ్యక్షుడు బండి నర్సయ్య కథనం ప్రకారం.. చెరువులో చేపలు మృత్యువాత పడి పైకి తేలడంతో గ్రామస్తులు ముదిరాజ్‌ సంఘం నాయకులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు, ముదిరాజ్‌ సంఘం నాయకులు వెళ్లి పరిశీలించారు. కాగా, అదే ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో గమనించిన ముదిరాజ్‌ నాయకులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement