అకాలవర్షం.. తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

అకాలవర్షం.. తడిసిన ధాన్యం

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

గోగుపల్లిలో వర్షపు నీటిని పారబోస్తున్న రైతు

టార్పాలిన్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తూ..

ఏటూరునాగారం: ఆరుగాలం పండించిన రైతులకు ప్రకృతి అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం, ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం కింద నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాటిని బకెట్ల ద్వారా ఎత్తి పారబోస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చెల్పాక తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో రైతు ఒక్కో కష్టంగా మారింది. సరైన గోదాంలు, టార్పాలిన్లు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పటికై న నిర్వాహకులు వేగంగా కాంటాలు నిర్వహించి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement