● కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను హేమంత్ సహదేవరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా, సమావేశపు గది, స్టేట్ బోర్డు, చాంబర్ లిస్టు టాయిలెట్స్, గార్డెనింగ్ సుందరీకరణ పరిశీలించారు. అనంతరం అధికారులకు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యామ్‌సింగ్, ఏఈ తదితరులు పాల్గొన్నారు.


