వైభవంగా హేమాచలుడి నాగవెల్లి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హేమాచలుడి నాగవెల్లి

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

సాక్షి వేసవికాసం

– వివరాలు 8లోu

భక్తిశద్ధలతో చక్రస్నానం

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

నూతన వధూవరులకు పుష్పయాగం

పిల్లలకు పాఠశాలలు ముగిశాయి. వేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా సాక్షి నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.

మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవతామూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగళవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్‌ పెస్టివల్‌ ఆఫీసర్‌ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి నిత్యపూజ, సేవాకాలం, బాలభోగం నిత్యహోమం, చతుస్థానార్చన, ఉత్సవ మూర్తులకు నవకలశ అభిషేక పూజలు, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు.

చింతామణి జలపాతం వద్ద చక్రస్నానం

ఉదయం 10 గంటలకు సుదర్శన చక్రం, స్వామివారికి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద వేద మంత్రోచ్చరణ నడుమ చక్రస్నానం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు యాగశాలలో మహా పూర్ణాహుతి, స్వామివారి కల్యాణ మండపంలో నూతన వధూవరులైన ఉత్సవ మూర్తులకు నాగవెల్లి, పుష్పయాగం కార్యక్రమాన్ని 12 రకాల పూలు, పండ్లతో ద్వాదశ పూజా కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. సంతానం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు యాగ్నికులు గరుడప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ సురేశ్‌, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, అనిపెద్ది నాగరాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌ రామానుజ దాస్‌, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పాల్గొన్నారు.

అనుమతి లేని పాఠశాలలను రద్దు చేయాలి

ఏటూరునాగారం: సబ్‌ డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టీఎల్‌.రవి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌ పరిధిలో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పర్మిషన్‌ లేకుండా వారి ఇష్టానుసారంగా ప్లెక్సీలు కట్టి ప్రచారాలు చేస్తూ పేద విద్యార్థులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలోనే యూనిఫామ్స్‌, పుస్తకాలు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement