అడ్మిషన్లపై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లపై నజర్‌

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

న్యూస్‌రీల్‌

– శ్యాంసుందర్‌,

జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌

ములుగు
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026

ట్విన్నింగ్‌ కార్యక్రమానికి

శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

ఒక్కో పాఠశాలకు రూ.5 వేల

నిధుల మంజూరు

జిల్లాలో 10 పాఠశాలల ఎంపిక

ములుగు రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ట్విన్నింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివి పైచదువులకు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

నిధులు మంజూరు

ట్విన్నింగ్‌ కార్యక్రమం అమలుకు, ఉన్నత పాఠశాలల సందర్శనకు జిల్లాలో ఎక్కువగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెసులు బాటును బట్టి విద్యార్థులతో కలిసి పాఠశాలలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ట్విన్నింగ్‌ కార్యక్రమం అమలుకు ఒక్కో పాఠశాలకు రూ. 5 వేలను జిల్లాలోని పది పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పాఠశాలల సందర్శన సమయంలో విద్యార్థుల రవాణా, అభ్యసన కార్యకలాపాలు, పాఠశాలల్లోని వసతుల వివరాలు రాసుకునేందుకు నోట్‌ బుక్కులు, పెన్నులు, తాగునీరు, స్నాక్స్‌ కోసం నిధులను వినియోగిస్తారు.

వసతుల పరిచయం

ఉన్నత పాఠశాలల్లో బోధన పద్ధతులు, పాఠశాల మౌలిక వసతుల సందర్శన, పాఠశాలల్లో చేసిన సైన్స్‌ ప్రయోగాలు చూపిస్తారు. బాలసభ నిర్వహణ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు వివరిస్తారు. క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాల పెంపునకు అవగాహన కల్పించడం, ఉపాధ్యాయుల ప్రత్యేక తరగతులతో పాఠశాలల ప్రాముఖ్యతలు వివరిస్తారు.

‘ట్విన్నింగ్‌’కు ఎంపికై న పాఠశాలల వివరాలు..

జిల్లాలో ట్విన్నింగ్‌ కార్యక్రమానికి ఎంపికై న పాఠశాలలు ములుగు ఎంపీపీఎస్‌ పాఠశాల, గోవిందరావుపేట మండలంలోని ఎంపీపీఎస్‌, చల్వాయి, ఏటూరునాగారం మండలంలోని శంకర్‌రాజ్‌పల్లి ఎంపీపీఎస్‌ పాఠశాల, మంగపేట మండలంలోని ఎంపీయూపీఎస్‌ పాఠశాల, కన్నాయిగూడెం మండల పరిధిలోని బుట్టాయిగూడెం ఎంపీపీఎస్‌, గుర్రేవుల ఎంపీపీఎస్‌, వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎంపీయూపీఎస్‌ పాత్రాపురం, ఎంపీయూపీఎస్‌ ఆర్‌సీ పురం, ఎంపీయూపీఎస్‌ ఉప్పేడు, వాజేడు మండలం పరిధిలోని ఎంపీయూపీఎస్‌ జగన్నాథపురం పాఠశాలలను ఎంపిక చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు అధికారుల కసరత్తు

విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్వశిక్షా అభియాన్‌తో కలిసి ట్వినింగ్‌ కార్యక్రమం అమలు చేస్తున్నాం. జిల్లాలో 10 పాఠశాలలను ఎంపిక చేశాం. విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల సందర్శన, బోధన పద్ధతులు, మౌలిక వసతులు, సైన్స్‌ ల్యాబ్‌ల గురించి వివరిస్తూ పాఠశాలల్లో ప్రవేశం పొందేలా చూస్తున్నాం. జిల్లాలో కార్యక్రమం పకడ్బందీగా అమలు చేస్తున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement