అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
మంగపేట: మండల కేంద్రంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు రన్నింగ్, మ్యూజికల్ చైర్స్, పాఠాలు, సంగీత పోటీలను జిల్లా సంక్షేమ శాఖ, మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పోటీలలో పాల్గొన్న వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పోటీలలో గెలుపొందిన వృద్ధులకు ఈ నెల 21న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతులను అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రేమలత, సిబ్బంది నాగేంద్ర, ఎఫ్‌ఆర్‌ఓ గణేశ్, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.


