మహిళా గ్రూపులకు డ్రెస్‌కోడ్
ఏటూరునాగారం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం నూతనంగా డ్రెస్‌కోడ్ దుస్తులను త్వరలోనే అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం సిరిసిల్ల జిల్లాలోని చేనేత వస్త్రాల తయారీ కేంద్రాల వద్దకు ఇటీవల జిల్లా సమాఖ్య నుంచి ముగ్గురు సభ్యులను పంపించారు. అక్కడ తయారవుతున్న వస్త్రాలు, వాటి విధానం, నాణ్యతను పరిశీలించే విధంగా మూడు రోజుల పర్యటన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ సీఈఓ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద రెండు జతల చీరలను ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రక్రియను ఈ నెలఖారు వరకు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కార్యక్రమం ముందు ఒక చీర ఆ తర్వాత మరో చీరను అందజేయనున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో 68,532 మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ఒకే రకం చీరెలను ధరించడం వల్ల పేద, ధనికుల మధ్య బేధం లేకుండా అందరూ సమానమే అనే భావన ఏర్పడుతుంది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులు వారి సొంత డబ్బులతో చీరలను కట్టుకొని గ్రూప్ సమావేశానికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ సమయంలో కొంత మేర డ్రెస్‌కోడ్ నడిచింది. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే మహిళా సంఘాల సభ్యులు వీఓ గ్రూపు సమావేశాలకు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తరలివచ్చే సమయంలో ఈ చీరలను ధరించాలని మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. మహిళలకు రెండు జతల బట్టలను ఇవ్వడంతో కొంత మేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాటిని ధరించి మీటింగ్ వెళ్లాలా అనే అసంతృప్తి వ్యక్తం చేసేవారు కూడా ఉండడం గమనార్హం.
మహిళలకు నీలిరంగు చీరలు
మహిళాలు ఆకాశానికే హద్దుగా గుర్తింపు పొందడంతో నీలి రంగు చీరల పంపిణీకి సిద్ధమయ్యారు. నీలం రంగు తీసుకోవడానికి కారణం సీ్త్ర, మహిళ అనగానే ప్రత్యేక గుర్తింపు, వారికి ఎవరు హద్దు లేరు కేవలం ఆకాశమే వారికి హద్దు అన్నట్లు భావించాలనే ఉద్దేశంతో ఈ రంగును ఎంపిక చేసినట్లు తెలిసింది.
ప్రత్యేక గుర్తింపు కోసమే..
మహిళా సంఘాల సభ్యులు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్‌కోడ్‌ను ప్రవేశపట్టారు. వీఓ సంఘాల వద్ద ఇష్టానుసారంగా దుస్తులు వేసుకోవడం వల్ల సరైన గుర్తింపు, ఆకర్షణ కలుగుతుంది. వీఓ సంఘాల మహిళలు ఏదైనా వీఓ సంఘం, జిల్లా, మండల సమాఖ్యకు కు వెళ్లినప్పుడు కూడా ఈ డ్రెస్‌కోడ్‌ను ఉపయోగించాలని సూచనలు చేశారు. ఇవేకాకుండా సేవా కార్యక్రమాలకు కూడా ఈ డ్రెస్‌కోడ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని సెల్ప్ ఎంప్లాయీ గ్రూప్స్(ఎస్‌హెచ్‌జీ) ఉన్న సభ్యుల వివరాలను జిల్లా నుంచి రాష్ట్ర సెర్ప్‌కు అందజేశారు.
మండలాలు వీఓలు ఎస్‌హెచ్‌జీఎస్ సభ్యులు
ఏటూరునాగారం 37 735 7,183
గోవిందరావుపేట 31 747 7,522
కన్నాయిగూడెం 18 323 3,045
మంగపేట 57 1,192 11,980
ములుగు 50 1,244 12,318
ఎస్‌ఎస్‌తాడ్వాయి 33 586 5,849
వెంకటాపురం(ఎం) 32 796 8,047
వెంకటాపురం(కె) 42 727 7,094
వాజేడు 41 579 5,494
ఇందిరా మహిళాశక్తి కింద
మంజూరుకు ప్రభుత్వం ప్రణాళికలు
నూతన డిజైన్లు, చీరలను పరిశీలించిన జిల్లా సమాఖ్య సభ్యులు
త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
మహిళా గ్రూపులకు డ్రెస్‌కోడ్


