
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఫైర్ అధికారులు రవికుమార్, శ్రీకాంత్, ప్రవీణ్‌లు అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెస్పాన్స్, ఏటూరునాగారం ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల వినియోగంపై అవహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అవిలయ్య, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొమ్మాల సంధ్య, అధ్యాపకులు కిషన్, భిక్షం, రాజు, అశోక్, శ్రీలత, యాకూబ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.