పౌష్టికాహారంతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారంతో ఆరోగ్యం

Sep 19 2025 2:44 AM | Updated on Sep 19 2025 2:44 AM

పౌష్ట

పౌష్టికాహారంతో ఆరోగ్యం

పౌష్టికాహారంతో ఆరోగ్యం చిన్నారులపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో పోషణమాసోత్సవాలు ప్రారంభం

ములుగు రూరల్‌: మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిఏటా పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలను నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్‌ 16వ తేదీ వరకు 30 రోజుల పాటు సీ్త్ర–శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలు ఇవ్వడంతో పాటు కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అధికారులు పరిశీలించనున్నారు.

పోషణమాసం కార్యక్రమాలు..

పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మొదటి వారం పౌష్టికాహారం పంటలపై పోటీలు నిర్వహిస్తారు. బీఎంఐ పరీక్షలు, పిల్లల ఎత్తు, బరువు చూడడం, ఆహారంలో చెక్కర, నూనె తగ్గించడం, తల్లితండ్రులతో పౌష్టికాహారం ప్రతిజ్ఞ, స్థానిక వంటకాలను ప్రోత్సహించడం చేస్తారు. రెండోవారం ముర్రుపాలు, పిల్లల అనుబంధ ఆహారలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన పిల్లల తల్లులతో అనుభవాలు పంచుకోవటం, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలపై సమావేశాలు నిర్వహిస్తారు. మూడోవారం అతితీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించడం, రక్తహీనత, అధిక బరువుపై కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తారు. హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించడం, అంగన్‌వాడీ కేంద్రాలలో యోగా సాధన, పోషణ్‌ మిషన్‌ వంద రోజు కార్యక్రమం నిర్వహిస్తారు. పోషణ ఛాంపియన్లను సత్కరిస్తారు. నాల్గో వారం తాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ఆరు నెలల లోపు పిల్లలు ఉన్న బాలింతల ఇళ్లను సందర్శిస్తారు. తక్కువ నూనె, చెక్కర పదార్ధాల ప్రదర్శన, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పోషణ మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తాం. వయస్సుకు తగ్గట్టుగా బరువు లేని చిన్నారులను గుర్తించి ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తాం. నిత్యం పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం. నేటి నుంచి పోషణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. – తుల రవి, జిల్లా సంక్షేమాధికారి

జిల్లాలో 640 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలోని పది మండలాల్లో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు 1900 మంది ఉండగా బాలింతలు 1476, చిన్నారులు 17,259 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార లోపంతో పుట్టబోయే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో లేకపోవడం, గర్భిణుల్లో రక్తహీనత లోపాలను ఎక్కువగా గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థిఽతిపై ఆరాతీస్తూ సలహలు, సూచనలు అందిస్తున్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడీ సిబ్బంది గ్రా మాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

30 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు

గర్భిణులు, బాలింతలకు అవగాహన

మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి

పౌష్టికాహారంతో ఆరోగ్యం1
1/2

పౌష్టికాహారంతో ఆరోగ్యం

పౌష్టికాహారంతో ఆరోగ్యం2
2/2

పౌష్టికాహారంతో ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement