
మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ
● ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
ఏటూరునాగారం: గిరిజన మత్స్యకారుల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల పరిధిలోని ఐటీడీఏ కార్యాలయంలో దర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా బుధవారం మత్స్యకార అభివృద్ధిపై జిల్లాలోని 16 మంది గిరిజన మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, 33 ఆదివాసీ గ్రామ పంచాయతీల్లోని పెసా మొబిలైజర్లు, గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు 14 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో సభ్యులు సంఘంగా ఏర్పడి దరఖాస్తు చేసుకునే 6 రకాల పథకాలపై పీఓ వివరించారు. 14 రకాల పథకాల్లో ఏ పథకంపై ఆసక్తి ఉందనేది దరఖాస్తు ద్వారా మత్స్యశాఖకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్‌రాజ్, పాలేరు మత్స్యపరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త శ్యామ్‌ప్రసాద్, ఐటీడీఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, గిరిజనులు పాల్గొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ