ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో పస్రా పీఎస్‌ బెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో పస్రా పీఎస్‌ బెస్ట్‌

May 22 2025 12:48 AM | Updated on May 22 2025 12:48 AM

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో పస్రా పీఎస్‌ బెస్ట్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో పస్రా పీఎస్‌ బెస్ట్‌

గోవిందరావుపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పస్రా పీఎస్‌ బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌గా ఎంపికై ంది. ఈ మేరకు బుధవారం డీజీపీ జితేందర్‌ నుంచి పస్రా ఎస్సై అచ్చ కమలాకర్‌ బుధవారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల అత్యుత్తమ సేవలు కనబర్చిన ఎస్‌హెచ్‌ఓలపై రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టగా రాష్ట్రంలోనే టాప్‌ 10 పోలీస్‌ స్టేషన్‌గా జిల్లా నుంచి పస్రా ఎస్సై కమలాకర్‌ ఒకరుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్సై కమలాకర్‌కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ తనకు ఎల్లవేళలా అండగా ఉన్న ఉన్నతాధికారులకు, తనకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపారు. ఈ సందర్భంగా పస్రా ఎస్సై కమలాకర్‌ను ఎస్పీ శబరీశ్‌ అభినందించారు. పోలీస్‌ సేవలపై క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణలో జిల్లా నుంచి పస్రా ఎస్సై కమలాకర్‌ ఒకరిగా నిలవడం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement