
పనుల్లో వేగం పెంచాలి
ములుగు: జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే అదనపు కూలీలతో షిఫ్ట్‌ల వారీగా పనులు చేయించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ రఘువీర్, డీఈ రాంమూర్తి, జేఈ రాకేశ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర