
రెండో దఫా శిక్షణకు హాజరుకావాలి
గోవిందరావుపేట : రెండో దఫా శిక్షణకు ఉపాధ్యాయులు తప్పనిసరి హాజరు కావా లని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుంచి నాలుగు రోజుల పాటు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. 20వ తేదీ నుంచి తెలుగు, హిందీ, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు మండలంలోని చల్వాయి మోడల్ స్కూల్‌లో, బయోసైన్స్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు చల్వాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులకు మోడల్ స్కూల్ జవహార్‌నగర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజే డు, వెంకటాపురం(కె), మంగపేట మండలాల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఏటూరునాగారంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని వివరించారు. ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు విధిగా హాజరు కావాలని పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని