
హేమాచలుడి సన్నిధిలో భక్తుల రద్దీ
● జాతర ముగిసినా తరలివస్తున్న భక్తులు
మంగపేట: మండలదలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) ముగిసినా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఆదివారం సైతం యథావిధిగానే కొనసాగింది. ఈనెల 8వ తేదీన అంకురార్పనతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం వసంతోత్సవంతో ముగిసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు రాలేకపోయిన వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు ప్రతి ఆదివారం ఆలయంలో నిర్వహించే స్వామివారి తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని సంతానం ప్రాప్తి కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. హనుమాన్ మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 08 గంటల నుంచి సాయంత్రం 06 గంటలవరకు ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శేఖర్‌శర్మ, పవన్‌కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట ఆలయ పూజారులు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, డీసీ ఎంలలో కుటుంబ సబ్యులతో వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లోని ఽదైత(వనదేవత) ప్రాగణం, చెట్ల కింద వంటలు చేసుకుని సాయంత్రం వర కు స్వామివారి సన్నిధిలో సంతోషంగా గడిపారు.
20న హుండీల్లోని కానుకల లెక్కింపు
మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో 10 రోజులపాటు నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) ముగిశా యి. దీంతో బ్రహ్మోత్సవా సందర్భంగా ఆలయ క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కిపు ఈనెల 20న కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ వెల్లడించారు.

హేమాచలుడి సన్నిధిలో భక్తుల రద్దీ