
ఇచ్చిన మాట తప్పేదే లేదు..
● మంత్రి సీతక్క
మంగపేట: ప్రజలకు ఇచ్చిన మాట తప్పేదే లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలో గల శనిగకుంటలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేసిన కలెక్టర్ దివాకరతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమాశేంలో సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా పాలన ప్రభుత్వం ప్రతీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని తెలిపారు. 2023లో శనిగకుంటలో జరిగిన అగ్నిప్రమాదంలో కొన్ని కుటుంబాలు సరస్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సహకారం అందించామన్నారు. గతంలో తాను ఇచ్చన హామీ మేరకు నేడు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ,తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రుతదితరులు పాల్గొన్నారు.