
క్రాప్‌లోన్ ఉందని రైతుభరోసా డబ్బులు ఇవ్వడం లేదు..
ములుగు మండలం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్‌లో రూ. రెండు లక్షల క్రాప్‌లోన్ ఉంది. ప్రభుత్వం అందించిన రైతు భరోసా డబ్బులు రూ.27 వేలు ఖాతాలో జమ అయ్యాయి. వాటిని డ్రా చేసుకోవడానికి వెళ్తే లోన్ అమౌంట్ ఉందని ఆపివేస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. నాకు నాలుగు నెలల క్రితం పక్షవాతం వచ్చింది. రెండు నెలల క్రితం కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖర్చులకు డబ్బులు లేక నానా తంటాలు పడుతున్నాం. అధికారులు స్పందించి రైతుభరోసా డబ్బులు ఇప్పించాలి.
– ఇస్లావత్ సక్రు, కాశిందేవిపేట
ప్రభుత్వ సాయం అందలేదు..
మాది రైతు కుటుంబం. నా తండ్రి మేరుగు దేవేందర్ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమస్యతో 2017లో తల్లి అచల ఆత్మహత్యకు పాల్పడింది. నేను, నా తమ్ముడు లోకేష్ ఇద్దరం బరిగలానిపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదు. తహసీల్దార్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో గత ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించాను. ప్రస్తుతం రెండోసారి వినతిపత్రం అందించడానికి వచ్చాను.
– మేరుగు సౌమ్య, మల్లంపల్లి

క్రాప్‌లోన్ ఉందని రైతుభరోసా డబ్బులు ఇవ్వడం లేదు..